Header Banner

ఊహించని వివాదంలో చిక్కుకున్న యూనియన్ బ్యాంక్! రూ.7 కోట్ల బిల్‌తో..!

  Tue May 06, 2025 17:55        Business

ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్య రీతిలో వివాదంలో చిక్కుకుంది. మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ రచించిన 'ఇండియా@100' పుస్తకాలకు యూనియన్ బ్యాంక్ భారీ ఆర్డర్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. సుమారు రూ.7.25 కోట్ల విలువైన దాదాపు 2 లక్షల కాపీల కొనుగోలుకు బ్యాంక్ ఆర్డర్ ఇచ్చినట్లు, ప్రచురణకు ముందే 50 శాతం చెల్లింపులు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి సుబ్రమణియన్‌ను కేంద్రం అనూహ్యంగా వెనక్కి పిలిపించిన తరుణంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం. గతేడాది, ఈ పుస్తకాన్ని తమ వినియోగదారులకు, కార్పొరేట్ సంస్థలకు, పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలకు పంపిణీ చేయాలని యూనియన్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం నిర్ణయించినట్లు సమాచారం.

రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం కోసం, ఒక్కోటి రూ.350 చొప్పున 1,89,450 పేపర్‌బ్యాక్ కాపీలను, ఒక్కోటి రూ.597 చొప్పున 10,422 హార్డ్‌కవర్ కాపీలను కొనుగోలు చేసేందుకు బ్యాంక్ ఆర్డర్ చేసింది. 2024 ఆగస్టులో విడుదలైన ఈ పుస్తకం కోసం, విడుదలకు ముందే యూనియన్ బ్యాంక్ 50 శాతం మొత్తాన్ని ప్రచురణ సంస్థకు చెల్లించినట్లు 'ఎకనమిక్ టైమ్స్' తన కథనంలో పేర్కొంది. సాధారణంగా ఆంగ్ల పుస్తకాలు పదివేల కాపీలు అమ్ముడవ్వడమే కష్టం కాగా, ఏకంగా దాదాపు రెండు లక్షల కాపీలకు ఆర్డర్ ఇవ్వడం, బ్యాంకుకు చెందిన 18 జోనల్ కార్యాలయాల నుంచి తలా పదివేల కాపీల చొప్పున ఈ ఆర్డర్ వెళ్లడం పుస్తక ప్రచారం, కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న అనుమానాలకు తావిస్తోంది.
2018 నుంచి 2021 వరకు సీఈఏగా పనిచేసిన సుబ్రమణియన్‌ను, 2022లో ఐఎంఎఫ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. పదవీకాలం మరో ఆరు నెలలుండగానే ఇటీవలే ఆయన్ను కేంద్రం వెనక్కి పిలిపించింది. ఈ పుస్తక వ్యవహారంలో అవకతవకలే ఆయన రీకాల్‌కు కారణమై ఉండొచ్చని ఊహాగానాలున్నాయి. సుబ్రమణియన్ తొలగింపు పూర్తిగా భారత ప్రభుత్వ నిర్ణయమని ఐఎంఎఫ్ స్పష్టం చేయగా, ఆయన స్థానంలో నీతి ఆయోగ్ మాజీ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్‌ను నియమించారు. ప్రస్తుతం ఈ పుస్తక కొనుగోళ్ల వ్యవహారం బ్యాంకింగ్, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #UnionBankScandal #IndiaAt100 #BookDealControversy #PublicFunds #BankingNews #7CroreControversy #KrishnamurthySubramanian